ఆటగాడిని కాపాడిన అభిమాని….. ఫోటోను చూసి ప్రాబ్లమ్ చెప్పి, ప్రాణం నిలబెట్టాడు.!

ఆటగాడిని కాపాడిన అభిమాని….. ఫోటోను చూసి ప్రాబ్లమ్ చెప్పి, ప్రాణం నిలబెట్టాడు.!

716
0
SHARE

సాధార‌ణంగా మ‌న‌కు ఏదైనా దీర్ఘ‌కాలిక వ్యాధి వ‌స్తే దాని ల‌క్ష‌ణాలు బ‌యట ప‌డ్డాక గానీ ఆ వ్యాధి ఏమిటో, దాని నివార‌ణ‌కు ఏం చేయాలో గానీ తెలియ‌దు. అలాంటిది ఆ వ్యాధిని ముందుగానే ప‌సిగ‌ట్టి దాన్ని ఆరంభ ద‌శ‌లోనే అంత‌మొందించ‌డం చాలా క‌ష్ట సాధ్య‌మైన ప‌ని. కానీ కొన్ని సంద‌ర్భాల్లో మ‌న‌కు ప‌లు వ్యాధుల గురించి ముందుగానే తెలుస్తుంది. అది ఏవిధంగా అయినా కావ‌చ్చు. వేరే అనారోగ్యంతో హాస్పిట‌ల్‌లో చేరినా లేదంటే ఏవైనా వైద్య ప‌రీక్ష‌లు చేయించుకున్నా అలాంటి సంద‌ర్భాల్లో కొన్ని వ్యాధుల గురించి మ‌న‌కు ముందుగానే తెలిసేందుకు అవ‌కాశం ఉంటుంది. అయితే ఆస్ట్రేలియాకు చెందిన ఆ ప్ర‌ముఖ స్విమ్మింగ్ క్రీడాకారుడికి మాత్రం ఆశ్చ‌ర్య‌క‌రంగా త‌న‌కు ఉన్న క్యాన్స‌ర్ వ్యాధి గురించి చాలా చాలా ఆరంభ ద‌శ‌లోనే ఆశ్చ‌ర్య‌క‌రంగా, అనుకోని రీతిలో తెలిసింది. దీంతో అత‌ను స‌ద‌రు వ్యాధి నుంచి ముందుగానే సేఫ్‌గా బ‌య‌ట ప‌డ్డాడు కూడా. ఇంత‌కీ ఎవ‌రా ప్లేయ‌ర్‌..? అత‌నికి క్యాన్స‌ర్ ఉన్న‌ట్టు ముందుగానే ఎలా తెలిసింది..?

అత‌ని పేరు మాక్ హోర్ట‌న్‌. ఉండేది ఆస్ట్రేలియాలో. 2016 రియో ఒలంపిక్స్‌లో 400 మీట‌ర్ల ఫ్రీ స్టైల్ స్విమ్మింగ్‌లో గోల్డ్ మెడ‌ల్‌ను కూడా సాధించాడు. అంతకు ముందు జ‌రిగిన ఒలంపిక్స్‌తోపాటు ప‌లు అంత‌ర్జాతీయ పోటీల్లోనూ పాల్గొని మంచి స్విమ్మింగ్ క్రీడాకారునిగా పేరు తెచ్చుకున్నాడు. అయితే క్రీడాకారుల‌టే స‌హ‌జంగానే వారికి అభిమానులు ఉంటారు క‌దా. అలా ఓ అభిమాని మాక్ హోర్ట‌న్‌కు కూడా ఉన్నాడు. అత‌ను హోర్ట‌న్ పాల్గొన్న పోటీల‌న్నింటినీ చూస్తూ వ‌స్తున్నాడు. ఎన్నో ఏళ్లుగా హోర్ట‌న్‌కు అభిమానిగా ఉన్నాడు. ఈ క్ర‌మంలో స్విమ్మింగ్ సంద‌ర్భంగా హోర్ట‌న్ ఫొటోల‌ను కూడా అత‌ను తీస్తూ వ‌స్తున్నాడు. అయితే ఒక‌ప్ప‌టి హోర్ట‌న్ ఫొటోల‌కు, ఇప్ప‌టి ఫొటోల‌కు అత‌ను ఒక తేడా క‌నుగొన్నాడు. అదే అత‌ని రొమ్ముపై ఉన్న మ‌చ్చ‌.

గ‌తంలో 2012లో జ‌రిగిన ఆస్ట్రేలియ‌న్ ఒలంపిక్ ట్ర‌య‌ల్స్‌లో హోర్ట‌న్‌కు రొమ్ముపై ఓ మ‌చ్చ ఉండ‌డాన్ని పైన చెప్పిన అత‌ని అభిమాని చూశాడు. అయితే మ‌చ్చ‌లంటే సాధార‌ణంగా అంద‌రికీ ఉంటాయి. అలా అనే ఆ అభిమాని కూడా మొద‌ట్లో ప‌ట్టించుకోలేదు. కానీ ఈ మ‌ధ్యే జ‌రిగిన రియో ఒలంపిక్స్‌లో హోర్ట‌న్ ఫొటోలు తీస్తూ ఆ అభిమాని ఆగిపోయాడు. కార‌ణ‌మేమిటంటే… హోర్ట‌న్ రొమ్ముపై ఉన్న మ‌చ్చ మ‌రింత పెద్ద‌దిగా మారి న‌ల్ల రంగులోకి రూపాంత‌రం చెందింది. అయితే ఒలంపిక్స్‌లో హోర్ట‌న్ మెడ‌ల్ సాధించ‌డం, ఆ గేమ్స్ అన్నీ అయిపోవ‌డం జ‌రిగిపోయాయి. అనంత‌రం ఆ అభిమాని ఏం చేశాడంటే 2012లో హోర్ట‌న్ ఫొటోల‌ను, ఇప్ప‌టి హోర్ట‌న్ ఫొటోల‌ను హోర్ట‌న్‌కు మెయిల్ చేశాడు. ఆ మ‌చ్చ‌లు అనుమానాస్ప‌దంగా ఉన్నాయ‌ని, ఎందుకైనా మంచిది ఒక‌సారి ప‌రీక్షించుకోవాల‌ని హోర్ట‌న్‌కు స‌లహా ఇవ్వ‌డంతో హోర్ట‌న్ అలాగే చేశాడు. దీంతో స‌ద‌రు మ‌చ్చ‌లు క్యాన్స‌ర్‌వ‌ని తేలింది. హోర్ట‌న్‌కు చ‌ర్మ క్యాన్స‌ర్ ఆరంభ ద‌శ‌లో ఉంద‌ట‌. అందుకే ఆ మ‌చ్చ ఎప్ప‌టికప్పుడు పెద్ద‌దిగా అవుతూ, క‌ల‌ర్ మారుతూ వ‌స్తోంది. ఈ క్ర‌మంలో హోర్ట‌న్ స‌ద‌రు మ‌చ్చ‌ను స‌ర్జ‌రీ ద్వారా తీయించేసుకుని త‌న‌కు రాబోయే క్యాన్స‌ర్ మ‌హ‌మ్మారి వ్యాధి నుంచి త‌నను తాను కాపాడుకోగ‌లిగాడు. కాగా త‌న‌కు ఆ ఫొటోల‌ను పంపి అంత‌టి మేలు చేసినందుకు గాను స‌ద‌రు అభిమానికి ఎల్ల‌ప్పుడూ కృత‌జ్ఞుడిగా ఉంటాన‌ని హోర్ట‌న్ చెబుతున్నాడు.

అయితే నిజానికి ఆస్ట్రేలియాలో చ‌ర్మ క్యాన్స‌ర్ బారిన ప‌డి చ‌నిపోతున్న‌వారు చాలా ఎక్కువ‌ట‌. ఏటా 2 వేల మంది పౌరులు చ‌ర్మ క్యాన్స‌ర్‌తో చ‌నిపోతున్నార‌ని, ప్ర‌పంచంలో ఏ దేశంలోనూ ఇంత‌టి మ‌ర‌ణాలు లేవ‌ని అక్క‌డి సైంటిస్టులు కూడా చెబుతున్నారు. దీనికి కార‌ణ‌మేమిటంటే అక్క‌డి వాతావ‌ర‌ణంలో అతినీల‌లోహిత కిర‌ణాలు ఎక్కువ‌గా ఉండ‌డ‌మే. అందుకే చాలా మంది చ‌ర్మ క్యాన్స‌ర్ బారిన ప‌డుతున్నార‌ట‌. కానీ హోర్ట‌న్ విష‌యంలో స‌ద‌రు అభిమాని చూసిన డేగ క‌న్ను చూపుకు, సునిశిత దృష్టికి అత‌న్ని మ‌నం క‌చ్చితంగా అభినందించాల్సిందే క‌దా..!

మొన్నా మ‌ధ్య జ‌రిగిన రియో ఒలంపిక్స్‌లో గోల్డ్ మెడ‌ల్ సాధించిన అనంత‌రం (స‌ర్జ‌రీకి ముందు) హోర్ట‌న్ ఛాతిపై మ‌చ్చ‌ను కింది వీడియోలో స్ప‌ష్టంగా చూడ‌వ‌చ్చు..!

NO COMMENTS

LEAVE A REPLY